Friday, November 30, 2018

ఈ బ్లాగ్ ఎందుకు?

1. తెలుగు పాటలలోని మాటలు (lyrics) తెలుసుకోవడానికి. ఈ aspectలో, lyricsఅందించే చాలా websites లాగానే ఈ బ్లాగ్ కూడా. ఉదాహరణకి, జీన్స్ (1998) cinemaలో, 'హైర హైరా హైరబ్బా' పాటలో '50Kg తాజ్ మహల్ నాకే నాకా', 'faxలొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా' lyrics అర్థం అవడానికి నాకు చాలా time పట్టింది (కొన్ని సంవత్సరాలు! అప్పటికి నాకు internetతో పరిచయంలేక).

2. ఆ మాటలకి అర్థాలు తెలుసుకోవడానికి. అందరికీ, అన్ని పాటల్లోని అన్ని మాటలకి అర్థాలు తెలియకపోవచ్చు కాబట్టి, కొన్నింటికైనా తెలుసుకునే అవకాశం కోసం ఈ బ్లాగ్. ఉదాహరణకి, 'ఉసురే పోయెనే' పాటలో, 'మగనాలు' అనే తెలుగు పదానికి అర్థం తెలుసుకుని మురిసిపోయిన సందర్భం నాకింకా గుర్తుంది. అలాంటి excitement గురించి త్రివిక్రం గారు ఓసారి ఇక్కడ చెప్పి ఉన్నారు.

3. ఆ మాటల వెనకటి మనసు(భావాలు) తెలుసుకోవడానికి. పాటలు కూడా కవిత్వమే, in fact, cinema పాటలు, (ఈ కాలానికి) గొప్ప reachability ఉన్న సాహిత్య ప్రక్రియ అని నా గట్టి నమ్మకం. కవిత్వం కాబట్టి, ఒకే పాట, వినే వాళ్ళ భావుకతని బట్టి, వాళ్లకున్న లోకజ్ఞానాన్ని బట్టి, సాహిత్య పరిజ్ఞానాన్ని బట్టి, ఒక్కొక్కరినీ ఒక్కోరకంగా అలరిస్తుంది. ఉదాహరణకి, చాలాసార్లు ఆ మాటల్లో, పాటకి సంబంధించిన, సంబంధించని, వ్యక్తులకి, సన్నివేశాలకి, సాహిత్యానికి, ప్రదేశాలకి, వగైరాలకి references ఉంటాయి. అవి అందరికీ తెలిసి ఉండవు. అలాంటి referencesని తెలుసుకోవడం ద్వారా మరికొంత మందిని మరింత ఎక్కువ అలరించడం కోసం ఈ బ్లాగ్. ఒక్కోసారి, వేరే ప్రాంతాల మాండలికాలు వాడటం మూలంగా, కొన్ని పదాలు తెలుగే అయినా, చాలా సాధారణంగానే అనిపించినా, పూర్తిగా అర్ధమైనట్లు అనిపించదు. ఇందాకటి 'హైర హైరా హైరబ్బా' పాటలో, hero, '50Kg తాజ్ మహల్ నాకే నాకా', 'flight తెచ్చిన నందవనం నాకే నాకా', etc. ఇలా, 'ఉపమానం + నాకే నాకా' అని పాడుతాడు. తమిళ్లో కూడా 'ఎనక్కే ఎనక్కా' అని పాడుతారు. ఇంతకీ, ఈ 'నాకే నాకా' అంటే ఏంటని ఎప్పుడన్నా ఆలోచించారా? మా చుట్టుపక్కల ఊర్లలో (కడప జిల్లా) 'నాకే నాకా' అంటే, నాకు ఇచ్చేసినట్లేనా ? నేనే ownerనా ? ఇంక మళ్ళీ తిరిగి ఇవ్వనవసరం లేదుగా? అని అడగడం. చిన్నపుడు ఎవరైనా ఓ ఆడుకునే బొమ్మకాని, pocket money కానీ, ఇస్తే, మళ్ళీ తిరిగి ఇవ్వనవసరం లేదుకదా ? అని అడగడానికి 'నాకే నాకా?' అని అడిగేవాళ్ళం. అవునంటే obviousగా సంబరపడే వాళ్ళం. ఇక్కడ కూడా, hero, heroineకి ప్రేమని express చేసిన తర్వాత, తను accept చేసాక, ఆనందంతో ఉబ్బి తబ్బిబై, "అన్ని ఉపమానాలతో పోల్చదగ్గ" heroine ఇక 'నాకే నాకా?' అని పాడుకుంటాడు (పాట ముందు scene చుస్తే గమనించవచ్చు). చాలా subtleగా ఉంది కదా! ఇలా అని నాకనిపించింది. మరి అసలు ఉద్దేశం ఏంటనేది A.M. రత్నం మరియు శివగణేష్ చెప్పాలి. So, మీరుకూడా, ఇలా అందరికీ కనిపించనివి మీకు అనిపిస్తే, ఆయా చోట్ల (e.g. blog postsకి comments రూపంలో) చర్చిస్తారని ఆశిస్తున్నా.

4. తెలుగు cinema పాటలనే సువిశాల సహారా ఎడారిలో, సాహిత్యం అనే ఒయాసిస్సుని వెతుక్కునే బాటసారులకు (ఎంతమంది ఉంటారో తెలీదు, but, ఉంటారని మాత్రం నా నమ్మకం) ఏకొంచెమైనా ఊతమవ్వాలని.

5. వీటన్నిటితో పాటూ, నేను ఇంకొన్ని తెలుగు పాటలని, మాటలని, అనగా, తియ్యని కవిత్వాన్ని  ఆనందించొచ్చనే  నా స్వార్థం కోసం ఈ బ్లాగ్.

గమనిక: ఎంతో గొప్పవాళ్ళు రాసిన పాటలకి నాకున్న limited exposureతో వ్యాఖ్యానించడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఈ బ్లాగ్.  చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్లు అనిపించినా, నాకున్న అర్హత, యోగ్యత, కేవలం నా 'ఆసక్తి'  మాత్రమే అని గమనించగలరు. 

4 comments:

  1. 'నాకే నాకా' -- super గా విశదీకరించావు bro...

    అవును, నమ్మశక్యం కానిది మనం పొందుకున్నప్పుడు, సంభరాచర్యాలతో, confirm చేసుకోవడానికి, ఇది నిజంగా నాకేనా? ఇది నిజంగా నాకా? అని అడుగుతారు.

    ReplyDelete
  2. Great initiative MKR sir..Telugu pata tiyyadananni marintha daggara chestunna ee prayatnam abhinandaniyam

    ReplyDelete

ఏమన్నావో, ఏం విన్నానో

రచన: వెన్నెలకంటి (తమిళ్ లో ధనుష్) గానం: శ్వేత మోహన్ సంగీతం: అనిరుద్ రవిచందర్ సినిమా: నవ మన్మథుడు (2015) -------------------------------...