Sunday, December 16, 2018

ఏమన్నావో, ఏం విన్నానో

రచన: వెన్నెలకంటి (తమిళ్ లో ధనుష్)
గానం: శ్వేత మోహన్
సంగీతం: అనిరుద్ రవిచందర్
సినిమా: నవ మన్మథుడు (2015)
--------------------------------------------------------------------------
ఏమన్నావో, ఏం విన్నానో
కన్నుల్తో మాటాడే భాషే వేరు
ఏదో మాయ చేశావయ్యా, మనసుల్తో పాటాడే రాగం వేరు

చిన్ని చిన్ని ఆశే, సిరివెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే,  ఒక బాసే చేసె

గుచ్చే చూపుల్లోన, అర విచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన

ఓ దేహమై, ఓ ప్రాణమై, ఓ బంధమై వుందాములే
ఓ దేహమై, ఓ ప్రాణమై వుందాములే

(ఓ దేహమై)

రేపుల్లో, మాపుల్లో, చూపుల్లో పొంగు ప్రేమ,
చూపుల్లో పొంగు ప్రేమ, ఊపిరైనదీ

చెంపల్లో, కెంపుల్లో, సంపెంగ పూల ముద్దు,
సంపెంగ పూల ముద్దు చంపుతున్నదీ

ఈ గుండె నిండుగా నీ  రూపు నిండగా, నా నీడ రెండుగా తోచె కొత్తగా
నా కంటి పాపలే నీ జంట బొమ్మలే, మూసేటి రెప్పలే  దాచె మెత్తగా

(చిన్ని చిన్ని)

(ఓ దేహమై)
(ఓ దేహమై)

(ఏమన్నావో)
------------------------------------------------------------------------

కొత్తగా పెళ్ళైన జంట మధ్య, తొలినాళ్లలో చిగురించిన స్నేహం, మెల్లగా పెరిగి, మోహం, ప్రేమ, etc.ల మీదుగా, రెండు జీవితాలూ పెనవేసుకు పోయేంత బంధంగా మారడాన్ని చూస్తూ, అమ్మాయి పాడుకుంటున్న పాట ఇది. ఇద్దరికీ పెద్దలు కుదిర్చిన పెళ్లి (arranged marriage) కావడంతో, అపరిచితుల నుంచి మొదలు పెట్టిన ప్రయాణం, చూస్తుండగానే ప్రేమ ప్రయాణంగా మారుతుందన్నమాట.  చాలా అందమైన సందర్భానికి , వెన్నెలకంటి గారు, మనసుకు హత్తుకునే మృదువైన మాటలతో పాటని రాశారు. దానికి అనిరుద్ melodious tune, శ్వేత మోహన్ గారి మధురమైన స్వరం కలిపి, దీన్ని గొప్పపాటని చేశాయని చెప్పొచ్చు.



ఏమన్నావో, ఏం విన్నానో
కన్నుల్తో మాటాడే భాషే వేరు
ఏదో మాయ చేశావయ్యా, మనసుల్తో పాటాడే రాగం వేరు


వాళ్ళిద్దరి మధ్య అల్లుకుపోయిన ఆ relationని చూస్తూ, 'అసలు నువ్వేం మాట్లాడావు?, నేనేం విన్నాను?; బహుశా, చూపులనే భాషలో,  కళ్లతోనే  మాట్లాడుకుంటున్నట్లు ఉన్నాం మనం' అనుకుంటోంది. 'ఏదో magic చేశావు, నా మనసుతో ఏకంగా (మాట దాటి) `పాటా`డుతున్నావు, ఆ రాగం వేరే, అది అనురాగం'.
ఇక్కడ, 'పాటాడు' అనే పదం poetic liberty లాగా కనిపించినా, పాట ఆడు అని కూడా అర్థం చేస్కోవచ్చు.



చిన్ని చిన్ని ఆశే, సిరివెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే,  ఒక బాసే చేసె


వెన్నెల్లో విచ్చుకునే పువ్వులాగా, నాలో చిన్న చిన్న ఆశలు మొలకెత్తుతున్నాయి. (could be of romantic nature )
మనసు, 'లోపలి' సంగతి మెల్లగా నీకు సైగ చేస్తోంది (could be, expressing herself in the process of getting closer)

(బాస=సంకేతము, సైగ )*ఇక్కడ
(ఊసు=సంగతి )*ఇక్కడ



గుచ్చే చూపుల్లోన, అర విచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన

గుచ్చుకునే నీ చూపుల్లో, పూర్తిగా విచ్చుకోని నీ నవ్వుల్లో, మనిద్దరం కలిసి ఉండే వేళల్లో (మరి అవి తనకి నచ్చే వేళలు కదా!) మల్లెల వాన కురిసినంత హాయి ఉంటుందని చెబుతోందన్నమాట. అర విచ్చిన అనడం, ప్రాస కోసం మాత్రమే కాకుండా, సందర్భానికి కూడా  బాగా సరిపోయిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే, ఒకరంటే ఒకరికి కొత్తదనం వల్ల, మరియు, ఇంట్లో పెద్దలు ఉండటం వల్ల ఇద్దరికీ ఇంకా inhibitions ఉండే అవకాశం ఉంది, కాబట్టి, పూర్తిగా expressiveగా ఉండలేరేమో. 

గుచ్చే-విచ్చే-నచ్చే, అలాగే, లోన-లోన-వాన వినడానికెంత బావుందో కదా ప్రాస!


ఓ దేహమై, ఓ ప్రాణమై, ఓ బంధమై వుందాములే
ఓ దేహమై, ఓ ప్రాణమై వుందాములే


ఒకే body, ఒకే soul లాగా, ఒక్కటై ఇలాగే ఉండిపోదాం అని అతనిపట్ల ఉన్న ప్రేమని చెప్పుకుంటోంది.  


రేపుల్లో, మాపుల్లో, చూపుల్లో పొంగు ప్రేమ,
చూపుల్లో పొంగు ప్రేమ, ఊపిరైనదీ


పగలూ రాత్రి నీ చూపుల్లో నాపై  పొంగే ప్రేమే నాకు ఊపిరి లాగా అయ్యింది అని వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని గురించి చెప్పుకుంటోందన్నమాట. In other words, ఆ ప్రేమ లేకపోతే తాను బ్రతకలేను అని చెప్పుకోవడం.
(రేపు=పగలు, early morning)
(మాపు=రాత్రి)


చెంపల్లో, కెంపుల్లో, సంపెంగ పూల ముద్దు,
సంపెంగ పూల ముద్దు చంపుతున్నదీ


చెంపల్లో, సిగ్గుపడటం వల్ల వచ్చిన ఎరుపులో, నువ్వు పెట్టే సంపెంగ పూవులాంటి (మెత్తని or హాయైన) ముద్దు నన్ను చంపుతోంది అని పదే పదే గుర్తొచ్చే ఒక తియ్యని జ్ఞాపకాన్ని గుర్తుచేసుకోవడం.


ఈ గుండె నిండుగా నీ  రూపు నిండగా, నా నీడ రెండుగా తోచె కొత్తగా 
నా కంటి పాపలే నీ జంట బొమ్మలే, మూసేటి రెప్పలే  దాచె మెత్తగా

These are my favorite lines. This is some wonderful poetry.  నా గుండెంతా నువ్వు నిండిపోవడం వల్ల, ఇప్పటిదాకా ఒక్కరిగానే కనిపించిన నా నీడ, ఇప్పుడు (నాలో నువ్వు ఉండటం వల్ల) ఇద్దరి లాగా కనిపిస్తోంది కొత్తగా, అని చెప్పడం. Creative expression కాదూ! అంతేనా, నా కళ్ల నిండా నువ్వు ఉండటం వల్ల (నిన్ను దాచుకోవడం వల్ల) నా కంటి పాపలు రెండూ, నీ (జంట=రెండు) బొమ్మల్లాగా అయిపోయాయి. మూసే నా కనురెప్పలు వాటిని నాలోనే మెత్తగా దాచుకుంటాయి అని అతని మీద ఏర్పడిన ప్రేమని సున్నితంగా చెబుతోంది. 

----------------------------------------------------------
తమిళ్ లో ధనుష్ కూర్చిన version తెలుగు versionకి spiritలో చాలా దగ్గరగా ఉన్నా, exact ప్రయోగాల్లో మాత్రం గణనీయంగానే భిన్నంగా ఉందని నా అభిప్రాయం.

పెళ్లిచేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగిడే ఆడపిల్లలకి ఒక కల లాంటి ఈ పాటలో, ఒక సగటు నవ వధువు, తానేమంటోందో మరోసారి విందాం. 


Saturday, December 8, 2018

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం!


రచన: A M రత్నం, శివగణేష్ (తమిళ్ లో వైరముత్తు)
గానం: ఉన్ని కృష్ణన్, సుజాత
సంగీతం: A R రెహమాన్
సినిమా: జీన్స్ (1998)

-------------------------------------------------------------------------------------------------------------
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోకచిలుక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరులేని కోయిల పాటే అతిశయం

అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం

(పువ్వుల్లో)

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నై(పూలు ఉన్నాయి), పులవాసన అతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా, వాననీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మినుగురులు అతిశయమే
తనువున ప్రాణం ఏచోటనున్నదో, ప్రాణంలోన ప్రేమ ఏచోటనున్నదో, ఆలోచిస్తే అతిశయమే

(ఆ గిరులు)
(పువ్వుల్లో)

అల వెన్నెలంటి ఒక దీవి ఇరుకాళ్ళంట నడిచొచ్చే, నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడైనా, ఓ మాట్లాడే పువ్వా ను(వు) ఎనిమిదావ అతిశయము

నింగిలాంటి నీ కళ్ళు, పాలుగారే చెక్కిళ్ళు, తేనెలూరే అధరాలు అతిశయము
మగువ చేతి వేళ్ళు అతిశయమే, మకుటాల్లాంటి గోళ్లు అతిశయమే
కదిలే వంపులు అతిశయమే

(ఆ గిరులు)
(పువ్వుల్లో)

-------------------------------------------------------------------------------------------------------------

అతిశయము అనే పదానికి, అధికము, గర్వము, చోద్యము ఇలాంటి అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో చోద్యము, magnificent, wonderful, marvellous, uncommon ఇలాంటి అర్థాలు అన్వయించుకోవచ్చు. ఈ పాట నిజంగానే ఒక అద్భుతం. ఎందుకో చెప్పే చిన్న ప్రయత్నం చేస్తాను, కానీ, ఎక్కడ మొదలు పెట్టాలో మాత్రం తెలియడంలేదు, అన్ని అతిశయాలు ఉన్నాయి.

మొదటగా, పాటలోని సాహిత్యం; wonderful. చాలా సాధారణంగా కనిపించే ప్రకృతిలోని wondersని poeticగా వర్ణించిన తీరు హృద్యంగా ఉంది. 'పువ్వుల నుంచి పళ్ళు రావ'డాన్ని, 'పూవుల్లో దాగున్న పళ్ళు' అంటూ, అలానే, రంగు రంగుల paintingsలాంటి సీతాకోకచిలుక రెక్కలని, కన్నాలున్న వేణువు నుంచి గాలి సృష్టించే సంగీతాన్ని, ఎవరి దగ్గరా నేర్చుకోకుండానే పాడే కోయిల పాటని, అద్భుతాలు అంటూనే, ఇవన్నీ కాదు, అద్భుతాలకే ఆశ్చర్యం కలిగించే నువ్వే నాకు మహాద్భుతం అంటాడు. (అచ్చెరువు=ఆశ్చర్యం).

మహా పర్వతాలు, గొప్ప వృక్షాలు, ఉత్కృష్టమైన ప్రవాహాలు, ఇలాంటి అద్భుతాలే...వీ కూడా ప్రపంచానికి తెలియనప్పటి ముందు కూడా ఉన్న 'ప్రేమ' పెద్ద అద్భుతం అంటాడు. కాదనగలమా! I think, ఇక్కడ కవి Mount Everest, Nayagara waterfalls లాంటి అద్భుతాల గురించి అంటున్నాడేమో. గిరులు, తరులు, ఝరులు చాలా పొందిగ్గా కూర్చున్నట్లు అనిపించట్లేదూ!

పదహారేళ్ళ వయసులో 'అందరికి' పుట్టే 'ప్రేమే'కదా అతిశయం అంటూ, దాని సార్వత్రికతని, సార్వజనీనతని చెబుతున్నాడు. (ఇంకో [నా] అర్థంలో, సార్వత్రికము/universal  అంటే, ప్రేమ అన్ని విశేషములని/గొప్పలని/ప్రత్యేకతలని  ఇముడ్చు కొన్నది అని కూడా అనుకోవచ్చు.)  (ప్రాయము=వయసు, పరువం=యవ్వనము)

ఏ వాసనా లేని కొమ్మలపై పూచే సువాసన కలిగిన పూలు, ఉప్పునీరు కలిగిన సముద్రం నుంచి ఏర్పడిన మేఘం వర్షించే మంచినీరు (చిటికెడు ఉప్పుకూడా లేదే!), power లేకుండా, వేలాడే దీపాల్లాగా వెలిగే మినుగురు పురుగులు (firefly ), ఇవన్నీ ప్రకృతిలో నిత్యం కనిపించే అద్భుతాలు అంటూనే, శరీరంలో ప్రాణం ఎక్కడుంటుంది?, ప్రాణంలో ప్రేమ ఎలా ఉంటుందో, అన్నీ అతిశయాలే, ఆలోచించమంటున్నాడు.

మళ్లీ, తన ప్రేయసిని, 'రెండు కాళ్లమీద నడిచే వెన్నెల దీవి (island)' లాంటి నువ్వే నాకు అద్భుతం అంటాడు. ప్రపంచంలో అద్భుతాలు, '7 wonders' అని ఏడే అనుకుంటారు, కానీ, 'మాట్లాడే పువ్వు' లాంటి నువ్వు, ఎనిమిదవ అద్భుతం అంటూ మెత్తగా మురిసిపోతాడు.
(అల అంటే కెరటం అనే అర్థంతో పాటూ, ప్రసిద్ధి(famous)ని తెలిపే అర్థం కూడా. e.g. అల పాండవులు, అల IIT etc.  ఇక్కడ 'అల వెన్నెల' లాంటి అందమైన దీవి అంటున్నాడు తన ప్రేయసిని)

 నింగిలాంటి నీ కళ్ళు (విశాలమైన or sparkling like sky, ఇలా అనుకోవచ్చేమో), పాల చెక్కిళ్ళు, తేనెలూరే పెదవులు, అన్నీ అద్భుతమే. ఇది సాధారణ వర్ణనలాగానే అనిపించినా, వెంటనే, ఆమె చేతి వేళ్ళు, వాటికున్న గోళ్లు కూడా అద్భుతమే అంటూ అలరిస్తాడు. మరి, ప్రేయసి చేతి వేలి గోళ్ళని, వాటి 'కిరీటాల్లా'గా (మకుటము = కిరీటము) ఉన్నాయంటూ మురిసిపోయిన సందర్భం నేను ఎక్కడా చదువలేదు, ఎవరు చెప్పగా విననూలేదు (ఎక్కడైనా ఉందా?). తన 'కదిలే సోయగాలు' అద్భుతమే అంటూ, నఖశిఖ పర్యంతమూ (కాలిగోటి నుంచి తలమీది జడ/కొప్పు వరకూ)   వర్ణించినంత పనిచేస్తాడు. ఈ చివరి రెండు చరణాలు సాగుతున్నంతసేపూ screen మీద ఐశ్వర్య-ప్రశాంత్,  lyricsని 'as (it) is' అభినయించడం మనకి ఒక visual అతిశయం.
-------------------------------------------------------------------------------------------------------------

సాహిత్యం తర్వాత చెప్పుకోవాల్సింది పాట చిత్రీకరణ.  ప్రపంచ వింతల (అతిశయాల) దగ్గరికి తీసుకెళ్లి, గర్వంగా, తన ప్రేయసిని ఎనిమదవ అతిశయం అని చెప్పుకోవడం ఇందులోని అతిశయం. దాదాపు 6.5 నిముషాల పాటకోసం, ఖండాలన్నీ తిరిగి, వరుసగా,  Great wall of China, Eiffel Tower, Empire State, Taj Mahal, Pyramids, Colosseum, Leaning Tower of Pisaలని చూపించడం మనం గమనించవచ్చు. (New York వెళ్ళినపుడు, Empire State ముందు వెళ్తూ పాడుకున్నా నేనీపాట :-), అదేమంత అతిశయం కాదు, గుర్తొచ్చి చెబుతున్నా!). I think, రచయిత దగ్గర, clearగా ఇలాంటి ఒక special పాట అనుకుంటున్నాను అని చెప్పి, అద్భుతాల గురించి రాయించుకున్నాడేమో శంకర్ అనిపిస్తుంది ఈ పాట. ఇంకా అతిశయం ఏంటంటే, వెళ్లిన ప్రతీచోటా, ఐశ్వర్యని అక్కడి (సాంప్రదాయ?) వేషధారణలో చూపించడం (ప్రశాంత్ ని కూడా try చేసారు). Pyramidsని చూపిస్తూ Cleopatra లాంటి వేషధారణ చూపించాక వెలిగింది నాకు ఇలాగని. ఎంతమంది నటీనటులకి ఇలాంటి 'అతిశయం' దొరికిఉంటుంది? Miss World అయిన (ఒకవేళ అవ్వకపోయినా) ఐశ్వర్యకి ఇంతకంటే గౌరవం/బహుమానం ఎవ్వరూ ఇవ్వలేరేమో? ఈలెక్కన ఐశ్వర్యని మాత్రమే Miss World అనాలేమో? 1997లో ఎన్ని ప్రయాసలకి ఓర్చి ఈ పాట చిత్రించారో అనిపిస్తుంది నాకు. By the way, Parisలో shoot చేస్తున్నపుడు Princess డయానా accident జరిగి, బృందం కొద్దిగా ఇబ్బంది కూడా పడ్డారని news. ఏదేమైనా, (అప్రస్తుతమైనా) నావరకు ఐశ్వర్య కోసమే ఈ పాట, ఇంకెవరినీ ఊహించుకోవడం కూడా వీలవదేమో!
-------------------------------------------------------------------------------------------------------------

Original పాట తమిళ్ లో వైరముత్తు గారు రాశారు, తెలుగు సేత (translation) దాదాపు అలానే ఉంది (to the best my knowledge). A R రెహమాన్ సంగీతం, ఉన్ని కృష్ణన్, సుజాతల గాత్రం, ఇలా, చాలా చాలా అతిశయాలు ఉన్న గొప్ప అతిశయం ఈ పాట. ఎన్నిసార్లు విన్నా తనివితీరదు అంటే, ఏమాత్రం అతిశయం కాదు. మళ్ళీ ఇంకోసారి వినండి.








Friday, November 30, 2018

ఈ బ్లాగ్ ఎందుకు?

1. తెలుగు పాటలలోని మాటలు (lyrics) తెలుసుకోవడానికి. ఈ aspectలో, lyricsఅందించే చాలా websites లాగానే ఈ బ్లాగ్ కూడా. ఉదాహరణకి, జీన్స్ (1998) cinemaలో, 'హైర హైరా హైరబ్బా' పాటలో '50Kg తాజ్ మహల్ నాకే నాకా', 'faxలొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా' lyrics అర్థం అవడానికి నాకు చాలా time పట్టింది (కొన్ని సంవత్సరాలు! అప్పటికి నాకు internetతో పరిచయంలేక).

2. ఆ మాటలకి అర్థాలు తెలుసుకోవడానికి. అందరికీ, అన్ని పాటల్లోని అన్ని మాటలకి అర్థాలు తెలియకపోవచ్చు కాబట్టి, కొన్నింటికైనా తెలుసుకునే అవకాశం కోసం ఈ బ్లాగ్. ఉదాహరణకి, 'ఉసురే పోయెనే' పాటలో, 'మగనాలు' అనే తెలుగు పదానికి అర్థం తెలుసుకుని మురిసిపోయిన సందర్భం నాకింకా గుర్తుంది. అలాంటి excitement గురించి త్రివిక్రం గారు ఓసారి ఇక్కడ చెప్పి ఉన్నారు.

3. ఆ మాటల వెనకటి మనసు(భావాలు) తెలుసుకోవడానికి. పాటలు కూడా కవిత్వమే, in fact, cinema పాటలు, (ఈ కాలానికి) గొప్ప reachability ఉన్న సాహిత్య ప్రక్రియ అని నా గట్టి నమ్మకం. కవిత్వం కాబట్టి, ఒకే పాట, వినే వాళ్ళ భావుకతని బట్టి, వాళ్లకున్న లోకజ్ఞానాన్ని బట్టి, సాహిత్య పరిజ్ఞానాన్ని బట్టి, ఒక్కొక్కరినీ ఒక్కోరకంగా అలరిస్తుంది. ఉదాహరణకి, చాలాసార్లు ఆ మాటల్లో, పాటకి సంబంధించిన, సంబంధించని, వ్యక్తులకి, సన్నివేశాలకి, సాహిత్యానికి, ప్రదేశాలకి, వగైరాలకి references ఉంటాయి. అవి అందరికీ తెలిసి ఉండవు. అలాంటి referencesని తెలుసుకోవడం ద్వారా మరికొంత మందిని మరింత ఎక్కువ అలరించడం కోసం ఈ బ్లాగ్. ఒక్కోసారి, వేరే ప్రాంతాల మాండలికాలు వాడటం మూలంగా, కొన్ని పదాలు తెలుగే అయినా, చాలా సాధారణంగానే అనిపించినా, పూర్తిగా అర్ధమైనట్లు అనిపించదు. ఇందాకటి 'హైర హైరా హైరబ్బా' పాటలో, hero, '50Kg తాజ్ మహల్ నాకే నాకా', 'flight తెచ్చిన నందవనం నాకే నాకా', etc. ఇలా, 'ఉపమానం + నాకే నాకా' అని పాడుతాడు. తమిళ్లో కూడా 'ఎనక్కే ఎనక్కా' అని పాడుతారు. ఇంతకీ, ఈ 'నాకే నాకా' అంటే ఏంటని ఎప్పుడన్నా ఆలోచించారా? మా చుట్టుపక్కల ఊర్లలో (కడప జిల్లా) 'నాకే నాకా' అంటే, నాకు ఇచ్చేసినట్లేనా ? నేనే ownerనా ? ఇంక మళ్ళీ తిరిగి ఇవ్వనవసరం లేదుగా? అని అడగడం. చిన్నపుడు ఎవరైనా ఓ ఆడుకునే బొమ్మకాని, pocket money కానీ, ఇస్తే, మళ్ళీ తిరిగి ఇవ్వనవసరం లేదుకదా ? అని అడగడానికి 'నాకే నాకా?' అని అడిగేవాళ్ళం. అవునంటే obviousగా సంబరపడే వాళ్ళం. ఇక్కడ కూడా, hero, heroineకి ప్రేమని express చేసిన తర్వాత, తను accept చేసాక, ఆనందంతో ఉబ్బి తబ్బిబై, "అన్ని ఉపమానాలతో పోల్చదగ్గ" heroine ఇక 'నాకే నాకా?' అని పాడుకుంటాడు (పాట ముందు scene చుస్తే గమనించవచ్చు). చాలా subtleగా ఉంది కదా! ఇలా అని నాకనిపించింది. మరి అసలు ఉద్దేశం ఏంటనేది A.M. రత్నం మరియు శివగణేష్ చెప్పాలి. So, మీరుకూడా, ఇలా అందరికీ కనిపించనివి మీకు అనిపిస్తే, ఆయా చోట్ల (e.g. blog postsకి comments రూపంలో) చర్చిస్తారని ఆశిస్తున్నా.

4. తెలుగు cinema పాటలనే సువిశాల సహారా ఎడారిలో, సాహిత్యం అనే ఒయాసిస్సుని వెతుక్కునే బాటసారులకు (ఎంతమంది ఉంటారో తెలీదు, but, ఉంటారని మాత్రం నా నమ్మకం) ఏకొంచెమైనా ఊతమవ్వాలని.

5. వీటన్నిటితో పాటూ, నేను ఇంకొన్ని తెలుగు పాటలని, మాటలని, అనగా, తియ్యని కవిత్వాన్ని  ఆనందించొచ్చనే  నా స్వార్థం కోసం ఈ బ్లాగ్.

గమనిక: ఎంతో గొప్పవాళ్ళు రాసిన పాటలకి నాకున్న limited exposureతో వ్యాఖ్యానించడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఈ బ్లాగ్.  చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్లు అనిపించినా, నాకున్న అర్హత, యోగ్యత, కేవలం నా 'ఆసక్తి'  మాత్రమే అని గమనించగలరు. 

ఏమన్నావో, ఏం విన్నానో

రచన: వెన్నెలకంటి (తమిళ్ లో ధనుష్) గానం: శ్వేత మోహన్ సంగీతం: అనిరుద్ రవిచందర్ సినిమా: నవ మన్మథుడు (2015) -------------------------------...