రచన: A M రత్నం, శివగణేష్ (తమిళ్ లో వైరముత్తు)
గానం: ఉన్ని కృష్ణన్, సుజాత
సంగీతం: A R రెహమాన్
సినిమా: జీన్స్ (1998)
-------------------------------------------------------------------------------------------------------------
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోకచిలుక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరులేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
(పువ్వుల్లో)
ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నై(పూలు ఉన్నాయి), పులవాసన అతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా, వాననీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మినుగురులు అతిశయమే
తనువున ప్రాణం ఏచోటనున్నదో, ప్రాణంలోన ప్రేమ ఏచోటనున్నదో, ఆలోచిస్తే అతిశయమే
(ఆ గిరులు)
(పువ్వుల్లో)
అల వెన్నెలంటి ఒక దీవి ఇరుకాళ్ళంట నడిచొచ్చే, నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడైనా, ఓ మాట్లాడే పువ్వా ను(వు) ఎనిమిదావ అతిశయము
నింగిలాంటి నీ కళ్ళు, పాలుగారే చెక్కిళ్ళు, తేనెలూరే అధరాలు అతిశయము
మగువ చేతి వేళ్ళు అతిశయమే, మకుటాల్లాంటి గోళ్లు అతిశయమే
కదిలే వంపులు అతిశయమే
(ఆ గిరులు)
(పువ్వుల్లో)
-------------------------------------------------------------------------------------------------------------
అతిశయము అనే పదానికి, అధికము, గర్వము, చోద్యము ఇలాంటి అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో చోద్యము, magnificent, wonderful, marvellous, uncommon ఇలాంటి అర్థాలు అన్వయించుకోవచ్చు. ఈ పాట నిజంగానే ఒక అద్భుతం. ఎందుకో చెప్పే చిన్న ప్రయత్నం చేస్తాను, కానీ, ఎక్కడ మొదలు పెట్టాలో మాత్రం తెలియడంలేదు, అన్ని అతిశయాలు ఉన్నాయి.
మొదటగా, పాటలోని సాహిత్యం; wonderful. చాలా సాధారణంగా కనిపించే ప్రకృతిలోని wondersని poeticగా వర్ణించిన తీరు హృద్యంగా ఉంది. 'పువ్వుల నుంచి పళ్ళు రావ'డాన్ని, 'పూవుల్లో దాగున్న పళ్ళు' అంటూ, అలానే, రంగు రంగుల paintingsలాంటి సీతాకోకచిలుక రెక్కలని, కన్నాలున్న వేణువు నుంచి గాలి సృష్టించే సంగీతాన్ని, ఎవరి దగ్గరా నేర్చుకోకుండానే పాడే కోయిల పాటని, అద్భుతాలు అంటూనే, ఇవన్నీ కాదు, అద్భుతాలకే ఆశ్చర్యం కలిగించే నువ్వే నాకు మహాద్భుతం అంటాడు. (అచ్చెరువు=ఆశ్చర్యం).
మహా పర్వతాలు, గొప్ప వృక్షాలు, ఉత్కృష్టమైన ప్రవాహాలు, ఇలాంటి అద్భుతాలే...వీ కూడా ప్రపంచానికి తెలియనప్పటి ముందు కూడా ఉన్న 'ప్రేమ' పెద్ద అద్భుతం అంటాడు. కాదనగలమా! I think, ఇక్కడ కవి Mount Everest, Nayagara waterfalls లాంటి అద్భుతాల గురించి అంటున్నాడేమో. గిరులు, తరులు, ఝరులు చాలా పొందిగ్గా కూర్చున్నట్లు అనిపించట్లేదూ!
పదహారేళ్ళ వయసులో 'అందరికి' పుట్టే 'ప్రేమే'కదా అతిశయం అంటూ, దాని సార్వత్రికతని, సార్వజనీనతని చెబుతున్నాడు. (ఇంకో [నా] అర్థంలో, సార్వత్రికము/universal అంటే, ప్రేమ అన్ని విశేషములని/గొప్పలని/ప్రత్యేకతలని ఇముడ్చు కొన్నది అని కూడా అనుకోవచ్చు.) (ప్రాయము=వయసు, పరువం=యవ్వనము)
ఏ వాసనా లేని కొమ్మలపై పూచే సువాసన కలిగిన పూలు, ఉప్పునీరు కలిగిన సముద్రం నుంచి ఏర్పడిన మేఘం వర్షించే మంచినీరు (చిటికెడు ఉప్పుకూడా లేదే!), power లేకుండా, వేలాడే దీపాల్లాగా వెలిగే మినుగురు పురుగులు (firefly ), ఇవన్నీ ప్రకృతిలో నిత్యం కనిపించే అద్భుతాలు అంటూనే, శరీరంలో ప్రాణం ఎక్కడుంటుంది?, ప్రాణంలో ప్రేమ ఎలా ఉంటుందో, అన్నీ అతిశయాలే, ఆలోచించమంటున్నాడు.
మళ్లీ, తన ప్రేయసిని, 'రెండు కాళ్లమీద నడిచే వెన్నెల దీవి (island)' లాంటి నువ్వే నాకు అద్భుతం అంటాడు. ప్రపంచంలో అద్భుతాలు, '7 wonders' అని ఏడే అనుకుంటారు, కానీ, 'మాట్లాడే పువ్వు' లాంటి నువ్వు, ఎనిమిదవ అద్భుతం అంటూ మెత్తగా మురిసిపోతాడు.
(అల అంటే కెరటం అనే అర్థంతో పాటూ, ప్రసిద్ధి(famous)ని తెలిపే అర్థం కూడా. e.g. అల పాండవులు, అల IIT etc. ఇక్కడ 'అల వెన్నెల' లాంటి అందమైన దీవి అంటున్నాడు తన ప్రేయసిని)
నింగిలాంటి నీ కళ్ళు (విశాలమైన or sparkling like sky, ఇలా అనుకోవచ్చేమో), పాల చెక్కిళ్ళు, తేనెలూరే పెదవులు, అన్నీ అద్భుతమే. ఇది సాధారణ వర్ణనలాగానే అనిపించినా, వెంటనే, ఆమె చేతి వేళ్ళు, వాటికున్న గోళ్లు కూడా అద్భుతమే అంటూ అలరిస్తాడు. మరి, ప్రేయసి చేతి వేలి గోళ్ళని, వాటి 'కిరీటాల్లా'గా (మకుటము = కిరీటము) ఉన్నాయంటూ మురిసిపోయిన సందర్భం నేను ఎక్కడా చదువలేదు, ఎవరు చెప్పగా విననూలేదు (ఎక్కడైనా ఉందా?). తన 'కదిలే సోయగాలు' అద్భుతమే అంటూ, నఖశిఖ పర్యంతమూ (కాలిగోటి నుంచి తలమీది జడ/కొప్పు వరకూ) వర్ణించినంత పనిచేస్తాడు. ఈ చివరి రెండు చరణాలు సాగుతున్నంతసేపూ screen మీద ఐశ్వర్య-ప్రశాంత్, lyricsని 'as (it) is' అభినయించడం మనకి ఒక visual అతిశయం.
-------------------------------------------------------------------------------------------------------------
సాహిత్యం తర్వాత చెప్పుకోవాల్సింది పాట చిత్రీకరణ. ప్రపంచ వింతల (అతిశయాల) దగ్గరికి తీసుకెళ్లి, గర్వంగా, తన ప్రేయసిని ఎనిమదవ అతిశయం అని చెప్పుకోవడం ఇందులోని అతిశయం. దాదాపు 6.5 నిముషాల పాటకోసం, ఖండాలన్నీ తిరిగి, వరుసగా, Great wall of China, Eiffel Tower, Empire State, Taj Mahal, Pyramids, Colosseum, Leaning Tower of Pisaలని చూపించడం మనం గమనించవచ్చు. (New York వెళ్ళినపుడు, Empire State ముందు వెళ్తూ పాడుకున్నా నేనీపాట :-), అదేమంత అతిశయం కాదు, గుర్తొచ్చి చెబుతున్నా!). I think, రచయిత దగ్గర, clearగా ఇలాంటి ఒక special పాట అనుకుంటున్నాను అని చెప్పి, అద్భుతాల గురించి రాయించుకున్నాడేమో శంకర్ అనిపిస్తుంది ఈ పాట. ఇంకా అతిశయం ఏంటంటే, వెళ్లిన ప్రతీచోటా, ఐశ్వర్యని అక్కడి (సాంప్రదాయ?) వేషధారణలో చూపించడం (ప్రశాంత్ ని కూడా try చేసారు). Pyramidsని చూపిస్తూ Cleopatra లాంటి వేషధారణ చూపించాక వెలిగింది నాకు ఇలాగని. ఎంతమంది నటీనటులకి ఇలాంటి 'అతిశయం' దొరికిఉంటుంది? Miss World అయిన (ఒకవేళ అవ్వకపోయినా) ఐశ్వర్యకి ఇంతకంటే గౌరవం/బహుమానం ఎవ్వరూ ఇవ్వలేరేమో? ఈలెక్కన ఐశ్వర్యని మాత్రమే Miss World అనాలేమో? 1997లో ఎన్ని ప్రయాసలకి ఓర్చి ఈ పాట చిత్రించారో అనిపిస్తుంది నాకు. By the way, Parisలో shoot చేస్తున్నపుడు Princess డయానా accident జరిగి, బృందం కొద్దిగా ఇబ్బంది కూడా పడ్డారని news. ఏదేమైనా, (అప్రస్తుతమైనా) నావరకు ఐశ్వర్య కోసమే ఈ పాట, ఇంకెవరినీ ఊహించుకోవడం కూడా వీలవదేమో!
-------------------------------------------------------------------------------------------------------------
Original పాట తమిళ్ లో వైరముత్తు గారు రాశారు, తెలుగు సేత (translation) దాదాపు అలానే ఉంది (to the best my knowledge). A R రెహమాన్ సంగీతం, ఉన్ని కృష్ణన్, సుజాతల గాత్రం, ఇలా, చాలా చాలా అతిశయాలు ఉన్న గొప్ప అతిశయం ఈ పాట. ఎన్నిసార్లు విన్నా తనివితీరదు అంటే, ఏమాత్రం అతిశయం కాదు. మళ్ళీ ఇంకోసారి వినండి.
No comments:
Post a Comment